కర్ణాటక మంత్రి రాజీనామా

బెంగళూరు: కర్ణాటకలో న్యాయశాఖ మంత్రి సురేశ్‌కుమార్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి సదానందగౌడ ఆయన రాజీనామాను తిరస్కరించారు. బెంగళూరు అభివృద్ధి సంస్థకు భూ కేటాయింపులపై న్యాయశాఖ మంత్రి సురేశ్‌కుమార్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంత్రి రాజీనామా సమర్పించినట్లు సమాచారం.