కర్మన్ ఘాట్ లో ఎల్.ఎన్.ఎస్ జ్యూవెలరీ షోరూం ప్రారంభం

ఎల్బీనగర్ (  జనం సాక్షి  ) ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ కర్మన్ ఘాట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్.ఎన్.ఎస్ జ్యూవెలరీ షోరూం ప్రారంభమైంది. ఎల్.ఎన్.ఎస్ జ్యూవెలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, గువ్వల బాలరాజు, రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ షోరూంలో నాణ్యమైన వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు మేకింగ్ ఛార్జీలు తీసుకోకుండానే విక్రయాలు జరుపుతున్నామని వివరించారు. తమ సంస్థ షోరూంలను విస్తరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగ విజయ్ కుమార్, చంద్రభాస్కర్, మారుతి, రాములు, పద్మ, రాజేందర్, శేఖర్, సాయిచంద్, ముఖ్యప్రభు, జూలూరి శ్రీనివాస్, ఆలంపల్లి శ్రీనివాస్, యాదయ్య, జైపాల్ భరత్,  సిబ్బంది పాల్గొన్నారు.