కలెక్టర్ ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా
కరీంనగర్ టౌన్ : అంగన్వాడీ టీచర్లు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్లు నేరవేర్చాలని ధర్నా చేశారు. సూమారు 500 మంది కార్యక్రర్తలు కలెక్టర్ ప్రధాన ద్వారం వద్ద నినాదాలు చేస్తూ, రాకపోకలు స్తంభింప చేశారు. అంగన్వాడీ నిధులు బడ్జెట్తో సంబంధం లేకుండా విడుదల చేయాలని, పెండింగు ఏరియర్స్, జీతాభత్యాలు, విడుదల చేయాలని, జగిత్యాల ప్రాంత అర్బన్ అంగన్ వాడీ సెంటర్లకు గుర్తింపు ఇవ్వాలని, మంత్రి ఇలాకాలో మహదేవపూర్ ప్రాంతంలో 2008 సంవత్సరాలుగా పెండింగులో ఉన్న బిల్లులు, కర్ర, గ్యాస్ నూనె, ఇంటి అద్దె అలవెన్సెలు, టీఏడీఏలు విడుదల చేయాలని, అంగన్వాడీకి దీటుగా బాలల బడులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ అధికారి రాములు వచ్చి వారి డిమాండ్లు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. అంగన్వాడీ టీచర్లు తమ డిమాండ్ల వినతిపత్రాన్ని ఆయనకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షురాలు జ్యోతి, అధ్యక్షురాలు శైలజ, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లత, జి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.