కవాతుకు అనుమతి నిరాకరించడం సబబు కాదు: రాఘవులు
హైదరాబాద్: తెలంగాణ కవాతును శాంతిభద్రతల సమస్యగా చూపి అనుమతి ఇవ్వకపోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. ఐకాస నేతలకు తెలంగాణ సమస్యపై ఆందోళన చేసే హక్కు ఉందన్నారు. శాంతియుతంగా కవాతు చేస్తామన్న ఐకాసపై నిర్బంధాన్ని ప్రయోగించడం శోచనీయమన్నారు. ఏకాభిప్రాయపడ్డారు. టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణపై స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించాలని రాఘవులు డిమాండ్ వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై మౌనం వహించడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖ కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతుందని రాఘవులు అభిప్రాయపడ్డారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసే లోగా ఏ అభిప్రాయం చెప్పాలో దానిపై స్పష్టతతో ఉండాలని సూచించారు.



