కాంగ్రెస్‌ అవకాశవాద వైఖరిని బయట పెట్టింది : సురవరం సుధాకరరెడ్డి

హైదరాబాద్‌: అఖిలపక్షంతో కాంగ్రెస్‌, అవకాశవాద వైఖరిని బయట పెట్టిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. అఖిలపక్ష సమావేశం ద్వారా ఏం సాధించదలచుకున్నారో ప్రజలకు షిండే చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ అంశాన్ని నాన్చడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అప్రతిష్ఠపాలైందని, నెలరోజుల్లో తెలుస్తామన్న మాట నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్‌ ప్రజలకు శాశ్వతంగా దూరమవుతుందని సురవరం అభిప్రాయపడ్డారు. ప్యాకేజీలతో సంతృప్తి పర్చకుండా కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని తుది నిర్ణయం తీసుకోవాలని , తమ లేఖకు కట్టుబడి ఉన్నామని తెదేపా ప్రకటించడం సానుకూలాంశమేనని సురవరం అన్నారు.