కాంగ్రెస్‌ అసమర్దత పతక స్తాయికి చేరింది

హైదరాబాద్‌:కాంగ్రెస్‌ అసమర్ద పతాకస్థాయికి చేరిందని, రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రపంచ దేశాల మధ్య మనదేశ ప్రతిష్ఠను దిగజార్చిందని బీజేపీ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రతిపక్షాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటే ఏకగ్రీవంగా ఉండేదని అన్నారు. ప్రత్యేక విదార్భ, తెలంగాణ కోసం పొరాడుతున్న సంగ్మాకు మద్దతివ్వాలని ఆయన కోరారు. రాయల తెలంగాణ తెరపైకి రావడం దురదృష్ట కరమన్నారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై స్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.