కాంగ్రెస్‌ చేతకానితనం వల్లే గ్యాస్‌ తరలిపోయింది

చిత్తూరు: కాంగ్రెస్‌ పార్టీ చేతకానితనం వల్లే రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్‌ మహారాష్ట్రలోని రత్నిగిరి ప్రాజెక్టుకు తరలిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. మాజీ ఎంపీ చెంగ్రలాయనాయుడు సంస్మరణ సభలో పాల్గొనడానికి చంద్రబాబు చిత్తూరు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్యాస్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్నాయంపై పార్లమెంట్‌ను సంభింపజేస్తామని  చెప్పారు. రాష్ట్రానికి కోతపెటి రత్నగిరి ప్రాజెక్టుకు కేటాయించిన  గ్యాస్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాని ప్రధానికి లేఖ రాయనున్నట్లు తెలియజేశారు.