కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరి తెలుసుకున్నాందుకు సంతోషం: నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పై కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరిని ఇప్పటికైనా తెరాస అధినేత కేసీఆర్‌ తెలుసున్నందుకు సంతోషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని  ఏర్పాటు చేస్తే తెరాసను విలీనం చేస్తానన్న కేసీఆర్‌ను అవమానించటమే కాకుండా తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తుందని ఆయన దుయ్యబట్టారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సాధించేందుకు రాజకీయపరంగా అవసరమైతే సీపీఐతో పొత్తుపెట్టు కోవాలని సూచించారు. భాజపా మతతత్త్వ పార్టీ అన్న కేసీఆర్‌ వ్యాఖ్యలతో ఆయన వ్యాఖ్యానించారు.