కార్మికులు విధులకు సక్రమంగా హాజరై, ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించాలి : కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్

ఎల్బీ నగర్ (జనం సాక్షి ) రాక్ టౌన్ కాలనీ లో గల నాగోల్ డివిజన్ వార్డు ఆఫీస్ లో నూతన చెత్త డబ్బాల పంపిణీ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ తొ కలిసి నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు హాజరై చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా చింతల అరుణ సురేందర్ యాదవ్ మాట్లాడుతూ కార్మికులు విధులకు సక్రమంగా హాజరై, ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించాలని, కాలనీలో లలో ఎక్కడ చెత్త, చేదారం లేకుండా చూడాలని ఆదేశించారు. డివిజన్ ప్రజలు కూడా కార్మికులకు సహకరించాలని, అందరి కృషితో నాగోల్ డివిజన్ ని చెత్త రహిత డివిజన్ గా మార్చడానికి సాధ్యపడుతుందని కార్పొరేటర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ ఎమ్ హెచ్ ఓ శ్రీనివాస్, SS చంద్రశేఖర్ రెడ్డి, జవాన్ శ్రీనివాస్, ఎస్ ఎఫ్ ఏ , నాయకులు సిద్దాల ఐలయ్య, డప్పు రాజు, సంజీవ్ రెడ్డి, వస్పరి మల్లేష్, దేవిడి నరేందర్ రెడ్డి, పద్మారెడ్డి, అనిత, లక్ష్మి జగదీశ్వరి, రావుల శ్రీనివాస్, నరేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.


