కాలిఫోర్నియాలో దుండగుల కాల్పుల్లో ముగ్గురి మృతి

హైదరాబాద్‌: అమెరికాలోని కాలిఫోర్నియాలో సాయుధులైన దుండగులు జరిపిన కాల్పులలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్‌ కన్‌వీనియన్స్‌ స్టోర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్టు చేయలేదని, దుండగుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.