కాశీబుగ్గ హైస్కూల్‌కు పర్యావరణ విత్ర అవార్డు
శ్రీకాకుళం, జూలై 31: జిల్లాలోని కాశీబుగ్గ జెడ్పీ ఉన్నత పాఠశాలకు పర్యావరణ మిత్ర అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మనవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఈ అవార్డును పాఠశాల హెచ్‌ఎం ఎన్.విజయకుమార్, గైడ్ టీచర్ కొయ్యల శ్రీనివాసరావు, విద్యార్థిని సీహెచ్.శిరీష అందుకున్నారు. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పర్యావరణ విద్యా కేంద్రం ప్రకటించిన ఈ అవార్డు కింద రూ. 10 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాప్తిక బహుకరించారు. నీటి వనరుల పొదుపు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, జీవ వైవిధ్యం, ఇంధన పొదుపు, సంస్తృతి-వారసత్వ సంపద పరిరక్షణ అనే అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులకు ఈ అవార్డు లభించింది. దీనికోసం జిల్లాలోని ఐదు ఉన్నత పాఠశాలను ప్రతిపాదించగా కాశీబుగ్గ పాఠశాలకు అవార్డు లభించడం విశేషం. ఈ ఘనత సాధించినందుకు విద్యార్థులు, గైడ్ టీచర్‌ను హెచ్‌ఎం విజయకుమార్ అభినందించారు.