కుంభమేళా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల

గుంటూరు : కుంభమేళాకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లైన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. స్థానికి విజయలక్ష్మీ సినిమాహాలు ప్రాంతంలో నివసించే ఓ వ్యాపారి కుటుంబంతో కలిసి కుంభమేళా కోసం అలహాబాద్‌ వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో చోరీ జరిగింది. 64 తులాల బంగారు నగలు, రూ. 4 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు,

తాజావార్తలు