కుమార్తెల తాకట్టుపై హైకోర్టు సీరియస్‌

జనంసాక్షి, హైదరాబాద్‌ : తీసుకున్న అప్పు కింద కుమార్తెలను తాకట్టు పెట్టిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిజామాబాద్‌ జిల్లా మాదారెడ్డికి చెందిన దంపతులు రూ. 35 వేలు అప్పు చెల్లించలేక తన ఇద్దరు కుమార్తెలను కరీంనగర్‌ జిల్లా మైతాపూర్‌కు జహంగీర్‌ వద్ద తాకట్టు పెట్టిన ఉదంతంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని సుమోటోగా తీసుకున్నా హైకోర్టు ఈ వ్యవహారాన్ని పిల్‌ (ప్రజాప్రయోజన వ్యాజ్యం)గా పరిగణిస్తున్నట్టు సోమవారం పేర్కొంది. వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశమున్న ఈ పిల్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, జగిత్యాల ఆర్డీవో, కరీంనగర్‌, ఎస్పీ, కార్మిక శాఖ కమిషనర్‌, జహంగీర్‌లను ప్రతివాదులుగా పేర్కొంది.