కురియన్, రోహిణీప్రసాద్‌ల మృతికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతి
హైదరాబాద్: క్షీర విప్తవ పితామహుడు కురియన్, విశ్రాంత శాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ల మృతి పట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్దికి కురియన్ చేసిన సేవలు మరువలేనివని ఆయన కొనియాడారు. అటామిక్ రేడియేషన్ డిటెక్షన్ నిపుణుడిగా రోహిణీప్రసాద్ సేవలను సీఎం గుర్తుచేశారు. ఇరువురి కుటుంబాలకు ప్రగాఢసానుభూతి ప్రకటించారు.



