కూకట్‌పల్లిలో 8 నెలల చిన్నారి హత్య
హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. 8 నెలల చిన్నారని దుండగులు దారుణంగా హత్య చేసి నీటి ట్యాంక్‌లో పడేశారు. వ్యక్తిగత కక్షలతోనే దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.