కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ షాద్ నగర్ లో నేడు జాతీయ సైన్స్ దినోత్సవం
జనం సాక్షి షాద్నగర్:- కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ షాద్ నగర్ లో లో నేడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమ ప్రారంభ వేడుకలలో భాగంగా షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు మరియు షాద్ నగర్ SI శ్రీ వెంకటేశ్వరులు గారు స్థానిక మాజీ కౌన్సిలర్ శ్రీ యుగెందర్ గారు ఈ కార్యక్రమ ప్రారంభ వేడుకలకు హాజరు అయ్యారు. ఇందులో వివిధ తరగతుల విద్యార్థిని విద్యార్థులు ఎంతో చురుకుగా పాల్గొని వారు తయారు చేసిన నమూనాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రదర్శనను ఎంతో చాకచక్యంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వివరించి అందరి మన్ననలను పొందారు మరియు కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులను వారు ప్రశంసిస్తూ కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే కాకుండా నిరంతరం సైన్స్ అన్వేషణ సాగించాలని అది మానవాళికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉండాలని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి రఫత్ సుల్తానా గారు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.