కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి

విజయవాడ: కృష్ణా జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడ్లవల్లేరు మండలం ఆంగలూరులో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.