కెపిహెచ్‌బిలో దోపిడీ!

హైదరాబాద్‌, జూలై 11 : కెపిహెచ్‌బిలో దోపిడి జరిగింది. ఎల్‌ఐజిలోని ఒక ఇంట్లో బుధవారం ఉదయం దొంగలు ప్రవేశించి ఇంటి యజమానురాలిని బాత్‌రూములో బంధించారు. ఇంటిలోని బీరువాను తెరిచి అందులో ఉన్న రూ.3.25లక్షల రూపాయలను, 10 తులాల బంగారాన్ని దోచుకుపోయారు. వారు వెళ్లిపోయినట్టుగా గమనించిన యజమానురాలి తలుపులు బాదడంతో పక్కనున్న వారు వచ్చి ఆమెను బాత్‌రూములో నుంచి వెలుపలికి తీసుకువచ్చారు. భయం భయంగా ఉన్న ఆమెను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిపారు. పోలీసులకు కూడా సమాచారాన్ని అందించారు. పోలీసులు, క్లూస్‌ టీమ్‌ రంగంలోకి దిగాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.