కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

share on facebook
–పెంచిన నిత్యవసర ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్.
తాండూరు.ఆగస్టు 5(జనంసాక్షి)కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు కేంద్ర రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిసిసి డెలిగేట్ ధారాసింగ్  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి నాయకులు జనార్దన్ రెడ్డి కోర్ వార్ నాగేష్ పలువురు మాట్లాడుతూ కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. పెంచిన నిత్యవసర ధరలను తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం భారీ వర్షాలతో రాష్ట్రంలో రైతులు పంటలను నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే పట్టించుకున్న పాపాన్ని పోవడం లేదని అన్నారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పొలాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, వెంటనే ప్రభుత్వం వ్యవసాయ అధికారులను వ్యవసాయ పొలాల్లోకి పంపించి నివేదికలను తెప్పించి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 

Other News

Comments are closed.