కేజ్రీవాల్‌ ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలి: అరుణ్‌కుమార్‌

హైదరాబాద్‌: అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసే ఆరోపణలపై కేంద్రప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టాలని కరప్షన్‌ ఫ్రీ ఇండియా సంస్థ ప్రతినిధి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. హెచ్‌ఎన్‌బీసీ బ్యాంక్‌ ద్వారా అక్రమంగా విదేశాలకు తరలిపోతున్న నిధులపై చర్యలు  ఏవని ఆయన మండిపడ్డారు. దీనిపై కేంద్రప్రభుత్వం 15 రోజుల లోపు దర్యాప్తు చేపట్టకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. హవాలా మార్గం ద్వారా ప్రజాధనం విదేశాలకు తరలిపోతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.