కేర్‌ ఆసుపత్రిలో చేరిన పోచారం

హైదరాబాద్‌, మార్చి 31 : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేరారు. సాధారణ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా.. వైద్య పరీక్షల్లో ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో ఆసుపత్రిలో చేరాలన్న వైద్యుల సూచన మేరకు ఆయన వెంటనే అడ్మిట్‌ అయ్యారు. డాక్టర్‌ సోమరాజు, నరసింహాన్‌ పర్యవేక్షణలో పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు..