కేసీఆర్‌తో కోదండరాం భేటీ

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌, తెలంగాణ జేఏసీ మధ్య ఏర్పడిన విభేదాలకు తెర పడనుంది. టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం సమావేశమయ్యారు. కోదండరాంతో పాటు జేఏసీ నేతలు  ఈ సమావేశానికి హాజరయ్యారు. పాలమూరు ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య చిన్న విభేదాలు ఏర్పాడినందుకు ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.