కొంచెం మార్పు.. కొంచెం కొనసాగింపు

c

– తమిళనాడులో డీఎంకే, బెంగాల్‌ తృణముల్‌, కేరళలో కామ్రేడ్‌లు, పుదుచ్చేరిలో డీఎంకే

– ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు

దిల్లీ,మే16(జనంసాక్షి): తమిళనాడు, పశ్చిమ్‌బంగ, కేరళ, అసోం రాష్ట్రాల అసెంబ్లీలకు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి జరిగిన ఎన్నికలపై పలు సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించాయి. ఈశాన్య భారతంలో పెద్దరాష్ట్రమైన అసోంలో తొలిసారిగా భాజపా కూటమి అధికారం చేపట్టనుందని ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్నాయి. పశ్చిమ్‌బంగలో అధికారంలో వున్న తృణమూల్‌ కాంగ్రెస్‌కే తిరిగి ఓటర్లు పట్టం కట్టినట్టు తెలిసింది. కేరళలో వామపకక్షూటమి, తమిళనాడులో డీఎంకేవైపు ఓటర్లు మొగ్గు చూపినట్టు పోల్స్‌ విశ్లేషించాయి.అసోం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భాజపాదే విజయమని ఇండియాటుడే- యాక్సిస్‌ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్‌ వెల్లడించింది.మొత్తం 126 స్థానాల్లో భాజపా కూటమికి 79 నుంచి 93 స్థానాలు దక్కవచ్చని తెలిపింది. కాంగ్రెస్‌ 26 నుంచి 33 సీట్లకు పరిమితం కానుండగా ఏఐడీయూడీఎఫ్‌ 6 నుంచి 10 స్థానాలను గెలుచుకునే అవకాశముంది.

కేరళలో కామ్రేడ్లకే అధికారం

కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సీపీఎం సారథ్యంలోని వామపకక్షూటమికే అధికారం దక్కనున్నట్టు ఇండియా టుడే- యాక్సిస్‌ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్‌లో వెల్లడయింది. ఎల్డీఎఫ్‌కు 88 నుంచి 101 సీట్లు, యూడీఎఫ్‌కు 38 నుంచి 48 సీట్లు దక్కవచ్చని తెలుస్తోంది. తొలిసారిగా రాష్ట్రంలో భాజపా బోణీ చేయనుంది. దాదాపు మూడుసీట్ల వరకు గెలుచుకునే అవకాశముంది. ఇతరులకు నాలుగుసీట్లు దక్కవచ్చని ఎగ్జిట్‌పోల్‌ తెలిపింది.

తమిళనాడులో డీఎంకే ముందంజ

దక్షిణాదిలో పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే కూటమి 132, అన్నాడీఎంకే 95 భాజపా 1, ఇతరులు 4 స్థానాలు గెలుచుకోవచ్చని ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్‌ తెలిపింది. గత పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 39 స్థానాలకు 37 సీట్లలో విజయం సాధించిన అధికార అన్నాడీఎంకే గట్టి పోటీ ఇచ్చినా 95 స్థానాలకే పరిమితం కానుంది.

పుదుచ్చేరిలోనూ డీఎంకే

కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరిలోనూ డీఎంకే హవా కొనసాగనున్నట్టు ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకారం డీఎంకేకు 18, ఏఐఎన్‌ఆర్‌సీకి 10, అన్నాడీఎంకేకు 1, ఇతరులు 1 స్థానం సాధించవచ్చని తెలుస్తోంది.

బెంగాల్లో మళ్లీ మమతకే పగ్గాలు

అస్సాం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిజెపిదే విజయమని ఇండియాటుడే- యాక్సిస్‌ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్‌ వెల్లడించింది. మొత్తం 126 స్థానాల్లో భాజపా కూటమికి 79 నుంచి 93 స్థానాలు దక్కవచ్చని తెలిపింది. కాంగ్రెస్‌ 26 నుంచి 33 సీట్లకు పరిమితం కానుండగా ఏఐడీయూడీఎఫ్‌ 6 నుంచి 10 స్థానాలను గెలుచుకునే అవకాశముంది. పశ్చిమ్‌బంగ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అధికారంలో వున్న మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమల్‌ కాంగ్రెస్‌ అధికారాన్ని తిరిగి కైవశం చేసుకుంటుందని ఏబీపీ ఆనంద ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించింది. మొత్తం సీట్లలో తృణమూల్‌ 178, లెఫ్ట్‌-కాంగ్రెస్‌ కూటమి 110, భాజపాకు 1, ఇతరులకు 5 సీట్లు దక్కవచ్చని తెలిపింది. ఇదిలావుంటే తమిళనాడు, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ పక్రియ ముగిసింది. అయితే సాయంత్రం 6 గంటలలోగా క్యూలో వున్న ఓటర్లు ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. తమిళనాడులోని 8 జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో పోలింగ్‌కు కొంత అంతరాయం కలిగింది. ఆయా వర్షప్రభావిత జిల్లాల్లో రాత్రి 7గంటల వరకు పోలింగ్‌ కొనసాగించినట్లు ఈసీ వెల్లడించింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పోలింగ్‌ కేంద్రాల్లో 6గంటలలోపు ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు. సాయంత్రం 5గంటల వరకు తమిళనాడులో 63.7 శాతం, కేరళ-70.4 శాతం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 80 శాతం పోలింగ్‌ నమోదైంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

దక్షిణాది రాస్ట్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్టాల్లో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా కొనగాయి. ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు వేసారు. ఈ ఎన్నికల్లో రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్‌, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. సినీనటులు కమల్‌హాసన్‌, రజినీకాంత్‌, కుష్బూ దంపతులు, విూనా, రాధిక, జీవా ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేశారు. ఓటుహక్కు వినియోగించు కోవడం వల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటు వేయడం అందరి బాధ్యత అని స్టాలిన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రజలు ముందుకు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 42.01 శాతం పోలింగ్‌ నమోదైంది. తమిళనాడు అసెంబ్లీలో 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. అరవకుచి అసెంబ్లీ స్థానానికి ఎన్నిక వాయిదా పడినందును 233 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 3740 మంది అభ్యర్థులు పోటీలో దిగారు. కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత, ఇదివరకటి ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత 91 ఏండ్ల కరుణానిధితోపాటు మరో ఇద్దరు సీఎం పదవి కోసం ఆరాటపడుతున్నారు. రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటుడు విజయకాంత్‌ డీఎండీకే పీడబ్ల్యూఎఫ్‌ టీఎంసీ కూటమి తరపున ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా రాజకీయ తెరముందుకొచ్చారు. ఇక పీఎంకే నుంచి అన్బుమణి రాందాస్‌ కూడా పాత రెండు పార్టీలను కాదని తమిళనాడు ప్రజలు తనకు పట్టం కట్టాలని కోరుకుంటున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీకి  ప్రశాంతంగా పోలింగ్‌ కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 54.64 శాతం పోలింగ్‌ నమోదైంది. బోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రస్తుత సీఎం ఏఐఎన్నార్సీ వ్యవస్థాపకుడు ఎన్‌ రంగాసామితో, విపక్ష కాంగ్రెస్‌ నేత వీ వైద్యలింగం, ఏఐఏడీఎంకే నాయకుడు పీ కన్నన్‌ సహా మొత్తం 344 మంది పోటీచేస్తున్నారు. ఈ చిన్న కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం ఓటర్ల సంఖ్య 9.41 లక్షలు. ఇదివరకెన్నడూ లేనివిధంగా ఇక్కడ ఈసారి బహుముఖ పోటీలు జరుగుతున్నాయి. ఏఐఎన్నార్సీ, ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే ఒంటరిగా పోటీ చేస్తుండగా, డీఎంకే కాంగ్రెస్‌ కలిసి పోటీకి దిగుతున్నాయి. కొత్తగా సీపీఐ, సీపీఎం, డీఎండీకే, వీసీకే, ఎండీఎంకే, ఆరెస్పీలతో ఏర్పడిన పీడబ్ల్యూఎఫ్‌ ఈసారి ప్రజల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి. కేరళ సీఎం ఉమెన్‌ఛాందీ కొట్టాయంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌, సినీనటులు మమ్ముట్టీ, సురేశ్‌గోపి, మాజీ కేంద్ర మంత్రులు ఏకే ఆంటోని, శశిథరూర్‌లు ఓటు వేశారు. కేరళ రాష్ట్ర అసెంబ్లీ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 46.5 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 1203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,61,06,422 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ (కాంగ్రెస్‌), విపక్ష సీపీఎం నేత 92 ఏండ్ల వీఎస్‌ అచ్యుతానందన్‌తోపాటు రాష్ట్ర ¬ంమంత్రి రమేశ్‌ చెన్నితాల, పరిశ్రమల మంత్రి, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ నేత పీకే కున్హలికుట్టి, ఆర్థికశాఖ మాజీ మంత్రి కేఎం మణి (కేరళ కాంగ్రెస్‌ ఎంపీ), సీపీఎం నేత పినరయి విజయన్‌, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్‌, క్రికెటర్‌ శ్రీశాంత్‌ తదితర ప్రముఖులు పోటీచేస్తున్నవారిలో ఉన్నారు. తమిళనాడులో 234 నియోజకవర్గాలున్నప్పటికీ 232 స్థానాల్లోనే పోలింగ్‌ జరుగుతోంది. అరవకురిచ్చి, తంజావూరులో ఓటర్లను అభ్యర్థులు ప్రలోభపెడుతున్నారని ఆరోపణలు రావడంతో అక్కడ ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. పటిష్ఠ బందోబస్తు కోసం రాష్ట్రంలో 1.25 లక్షల మందికి పైగా పోలీసులు, సాయుధ సిబ్బందిని మోహరించింది. ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని ఆర్కేనగర్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి అత్యధికంగా 45 మంది పోటీచేయడం విశేషం.కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ ఎన్నికల కోసం 52వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 30 స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్‌ఆర్‌సీ సహా అన్నాడీఎంకే, భాజపా, పీఎంకే పార్టీలు ఈసారి ఒంటరిగానే బరిలో ఉన్నారు.