రూపాయి ఘోరంగా పతనం

` ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి పడిపోయిన రూపీ
` ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.91.99కి చేరిన మారకం విలువ
` విదేశీ పెట్టుబడుల తరలింపు,వాణిజ్య ఒప్పందాల జాప్యం, అంతర్జాతీయ అనిశ్చితి కారణమంటున్న నిపుణులు
న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ మరోసారి ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.91.99కి 1.9 శాతం పడిపోయింది. ఇవాళ్టి మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక్క అమెరికన్ డాలర్ పెడితే,మన డబ్బూ రూ.91.99లు వస్తాయన్నమాట. మరోవైపు స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. 769 పాయింట్ల నష్టంతో 81.537 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద నిఫ్టీ ముగిసింది. రూపాయికి ఇప్పటివరకు ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు తమ నిధులు తరలించడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం వంటివి సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కూడా కారణమని అనలిస్టులు పేర్కొంటున్నారు. డిసెంబర్‌లో ఒకసారి 91 మార్కు దాటగా.. తాజాగా మరోసారి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయిలకు రూపాయి విలువ చేరడం గమనార్హం. పతనానికి ప్రధాన కారణాలు ఏంటంటే.. రూపాయి విలువ ఇంతలా దిగజారడానికి వెనుక పలు కారణాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విదేశీ పెట్టుబడుల తరలింపు: దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు తమ నిధులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు.వాణిజ్య ఒప్పందాల జాప్యం: అమెరికాతో జరగాల్సిన కీలక వాణిజ్య ఒప్పందాల్లో జాప్యం జరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.అంతర్జాతీయ అనిశ్చితి: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు డాలర్ బలపడటం వంటివి రూపాయిపై ఒత్తిడిని పెంచాయి.
ప్రభావం ఏమిటి?
దిగుమతి వస్తువులు(ఎలక్టానిక్స్, ఆయిల్, గోల్డ్) ఎక్కువ ఖరీదవుతాయి. విదేశీ ప్రయాణాలు, చదువులు, రెమిటెన్స్(ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ మార్జిన్) ఖర్చు పెరుగుతుంది.ఎక్స్‌పోర్టర్లకు కొంత లాభం కలగవచ్చు. కానీ, మొత్తంగా మన ఎకానవిÖపై ఒత్తిడి పెరుగుతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. బంగారం, వెండి దిగుమతులు పెరగడం, దేశీయ మార్కెట్ల నుంచి ఈఎఎలు విక్రయాలను కొనసాగించడం వంటి పరిణామాల మధ్య రూపాయి విలువ భారీగా పడిపోయింది. బుధవారం ఒక దశలో 77 పైసలు మేర పడిపోయింది. మంగళవారం 90.97 వద్ద ముగిసిన రూపాయి మారకపు విలువు ఈ ఉదయం 91.05 వద్ద ప్రారంభమైంది. అమెరికా, ఐరోపా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా యత్నాలు కొనసాగుతుండగా రూపాయి మారకపు విలువ ఒక దశలో అత్యల్ప స్థాయి అయిన 91.74కు పడిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి 91.73వద్ద స్థిరపడింది. దేశీయ స్టాక్‌మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు కూడా రూపాయి పతనానికి దారితీశాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.ప్రస్తుత ఏడాదిలో రూపాయి కదలికలకు ప్రధానంగా భారత్`అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పరిణామాలే కారణం. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరకుంటే 2026లో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 89`93 మధ్యలో కదలవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే 87.50`88 మధ్య ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. వాణిజ్య ఒప్పందం కుదిరినా భారత వస్తువులపై సుంకాలను 15`20 శాతానికి అమెరికా తగ్గించినప్పుడే సానుకూల పరిణామంగా చూడాలని చెబుతున్నారు.
ఒప్పందం కుదిరినా
అమెరికాతో భారత్‌కు వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ రూపాయి అనుకున్న స్థాయిలో బలపడకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒప్పందం అనంతరం ఒకవేళ రూపాయి పుంజుకున్నా, విదేశీ మారకపు నిల్వలను పెంచుకునే ఉద్దేశంతో డాలర్లను కొనేందుకే ఆర్‌బీఐ ప్రాధాన్యం ఇస్తుందని అంటున్నారు. ఈ కారణం వల్ల రూపాయి పుంజుకోవడం పరిమితంగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆర్‌బీఐ జోక్యం మాటేమిటి?
అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న సమయంలో రూపాయి కదలికల విషయంలో ఆర్‌బీఐ జోక్యం ఎలా ఉండొచ్చన్నదే కీలకంగా మారింది. గతేడాది రూపాయి విషయంలో జోక్యం చేసుకునేందుకు సమర్థ వ్యూహాలను ఆర్‌బీఐ అనుసరించలేదనే అభిప్రాయం ఉంది. అయితే ఆర్‌బీఐ వద్ద విదేశీ మారకపు నిల్వలు భారీగా తగ్గడం, డాలరుకు అధిక గిరాకీ నేపథ్యంలో ఒకవేళ అమెరికా అధిక సుంకాలు కొనసాగితే రూపాయి విలువను ఆర్‌బీఐ మరింత పడనిచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.