తప్పుడు ప్రచారం ఆపండి

` మీ మాటలను పట్టించుకునే పరిస్థితి లేదు
` తెలంగాణ ప్రజలు మళ్లీ మోసపోరు
` హరీశ్‌కు ఎమ్మెల్సీ దయాకర్ కౌంటర్
హైదరాబాద్(జనంసాక్షి):మాజీ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ దయాకర్ కౌంటర్ ఇచ్చారు. హరీష్‌రావు అతి తెలివితో మతి భ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు చేస్తే బీఆరఎస్ నాయకులకు బొగ్గు టెండర్లు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. నాలుగు జరిగితే మూడు విÖకు దక్కాయన్నారు. నీ చుట్టాలు టెండర్లు వస్తే నీకు ముడుపులు ముట్టలేదని వ్యతిరేకిస్తున్నారా? అబద్ధాన్ని నిజం చేయడానికి బావ బామ్మర్దుల తాపత్రయం మామూలుగా లేదన్నారు. అందుకే మిమ్మల్ని బిర్లా`రంగా అనేదని, విÖ మామనే నిన్ను పక్కన పెట్టారని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటారని అన్నారు.