హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి గ్యాలంటరీ అవార్డు

` ప్రాణాలకు తెగించి ‘మోస్ట్ వాంటెడ’ను పట్టుకున్న తెగువకు కేంద్ర పురస్కారం
హైదరాబాద్(జనంసాక్షి): ఎదురుగా 125 కేసుల్లో నిందితుడైన కరడుగట్టిన నేరస్థుడు. అదును చూసి పోలీసులపైకి తుపాకీ ఎక్కుపెట్టాడు.. రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తూటా దూసుకుపోయి కాలికి గాయమైనా, రక్తం వస్తున్నా గాయాన్ని పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ఆ నిందితుడిని హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి పట్టుకోగలిగారు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్దజరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో మోస్ట్ వాంటెడ్ ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
అసలేం జరిగిందంటే..?
నానక్‌రామ్‌గూడకు చెందిన ప్రభాకర్ (30) సాదాసీదా నేరస్థుడు కాదు. ఇతనిపై తెలుగు రాష్టాల్లో దాదాపు 125కు పైగా కేసులు ఉన్నాయి. 2022లో విశాఖ సెంట్రల్ జైలు ఎస్కార్ట్ నుంచి తప్పించుకుని అప్పటి నుంచి పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్నాడు. గౌలిదొడ్డిలోని ‘ప్రిజం పబ’కు ప్రభాకర్ వస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకటరెడ్డికి పక్కా సమాచారం అందింది.వెంటనే అప్రమత్తమైన వెంకటరెడ్డి, తన సహచర సిబ్బంది ప్రదీప్ రెడ్డి , వీరాస్వామి లతో కలిసి పబ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నిందితుడిని గుర్తించి, లొంగిపోవాలని ఆదేశించారు.కాల్పులతో విరుచుకుపడ్డ నిందితుడుపోలీసులను చూడగానే కంగుతిన్న ప్రభాకర్, తప్పించుకోవాలనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న తుపాకీ తీసి పోలీసుల వైపు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఒక తూటా వెంకటరెడ్డి ఎడమ కాలి బొటనవేలికి తగిలి రక్తస్రావమైంది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా, తన గాయాన్ని లెక్కచేయకుండా వెంకటరెడ్డి ఇతర కానిస్టేబుళ్లతో కలిసి నిందితుడిపైకి దూకి అతడిని కట్టడి చేశారు. ప్రాణాలకు తెగించి నిందితుడిని పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.సాహసానికి గుర్తింపు గ్యాలంటరీ అవార్డుగత 20 ఏళ్లుగా పోలీస్ శాఖలో అంకితభావంతో పనిచేస్తున్న మర్రి వెంకటరెడ్డి, గతంలోనూ పలువురు భయంకరమైన నేరస్థులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో నమోదైన ఉదంతంలో ఆయన చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా, 2026 రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనను కేంద్ర ప్రభుత్వ ‘మెడల్ ఫర్ గ్యాలంటరీ’ అవార్డు దక్కింది. ప్రస్తుతం నిందితుడిపై హత్యాయత్నం, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.