రెండ్రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

` అభివద్ధి, సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ఓటు బ్యాంకు
` బీఆరఎస్ పదేళ్లలో చేయని అభివద్ధి.. ప్రజాప్రభుత్వం రెండేళ్లలో చేసి చూపించాం
` మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్/జగిత్యాల(జనంసాక్షి):వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ అధికారం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా చేపట్టిన అభివద్ధి, అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విÖద విశ్వసనీయతను పెంపొందించిందని ఆయన పేర్కొన్నారు.జరిగిన అభివద్ధిని అమలుజరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకపోయేందుకు కాంగ్రెస్ పార్టీ లీడర్, క్యాడర్ కషి చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.రానున్న పురపాలక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పురపాలక సంఘం ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు గాను లోకసభ నియోజకవర్గాల వారిగా మంత్రులను ఇంచార్జీలుగా నియమంచిన విషయం విదితమే.ఆ క్రమంలో భాగంగ నిజామాబాద్ లోకసభ నియోజకవర్గానికి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు.ఈ సందర్భంగా ఆదివారం రోజున నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ పరిధిలోని నిజమాబాద్ కార్పొరేషన్,బోధన్, ఆర్ముర్,భీంగల్,మెట్పల్లి,కోరుట్ల పురపాలక సంఘం పరిధీలలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వ సలహాదారులు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి,మరో ప్రభుత్వ సలహదారు యం.డి షబ్బీర్ అలీ నిజమాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి,శాసనమండలి సభ్యులు బల్మురి వెంకట్,కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకష్ణ మాజీ శాసనమండలి సభ్యులు నర్సిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ పురపాలక సంఘం విÖద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.పార్టీ నిర్వహిస్తున్న సర్వేల ఆధారంగా టికెట్లు ఖరారు చేస్తామని ఆయన ప్రకటించారు.సర్వేతో పాటువిధేయత,చిత్తశుద్ధి, క్రమశిక్షణ ల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు.అదే సమయంలో అవకాశం రాని వారికి ప్రత్యమ్నాయ అవకాశాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.పార్టీ కోసం శ్రమించే ప్రతీ ఒక్కరికీ అండగా ఉంటామని ఆయన చెప్పారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటేనే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతోటే అని ఆయన అన్నారు.పార్టీ గెలుపులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు.పట్టణ ప్రాంతాల అభివద్ధిపై ప్రత్యేక దష్టి సారించామన్నారు.జరుగుతున్న అభివద్ధికి మరిన్ని నిధులు మంజూరు చెసి పట్టణ ప్రాంతాలలో మెరుగైన అభివద్ధి జరుపుతామని ఆయన చెప్పారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విÖదట జరుగుతున్న అభివద్ధి అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెడితే పురపాలక సంఘం ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగిస్తామని ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు.అర్హులైన నిరుపేదలకు యావత్ భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.గతంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు ఆ బియ్యం వినియోగించేందుకు ప్రజలు ఇష్ట పడక పోగా వాటిని అమ్ముకునే వారని ఆయన చెప్పారు.దొడ్డు బియ్యం ప్రజలు వినియోగించుకోక పోగా పక్కదారి పట్టి అనేక అక్రమాలు జరిగేవని ఆయన చెప్పారు.అటువంటి అవకతవకలకు చెక్ పెట్టడంతో పాటు రాష్ట్రంలోని 85% ప్రజలకు 13,600 కోట్ల వ్యయంతో ఉచితంగా సన్నబియ్యం అందించిన విప్లవాత్మక నిర్ణయం కాంగ్రెస్ పార్టీదే అన్నారు.ఒక్క నిజమాబాద్ కార్పొరేషన్ పరిధిలోనే 18000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు.నిరుపేదల కడుపు నింపేందుకు ఉద్దేశించబడిన నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ ఉచితంగా అందిస్తున్న అంశం తనకెంతో తప్తి నిచ్చిందని ఆయన చెప్పారు.నిరుపేదల కళ్ళలో వెలుగులు నింపాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పమన్నారు.మహిళలకు ఉచితంగా ఆర్.టి.సి బస్సులో ప్రయాణ సౌకర్యం,పేదలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించడం,సన్నబియ్యం పంపిణీ అందులో భాగమే నని ఆయన తెలిపారు.అన్నింటికీ మించి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు తెల్లరేషన్ కార్డుల మంజూరు చేసిన ఘనత ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనిదే నని ఆయన పేర్కొన్నారు.పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయక పోగా ఉన్న కార్డులలో కొత్త సభ్యుల చేర్పులకు కుడా అవకాశం ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.ఇటువంటి అంశాలతో ప్రజల దగ్గరకు పోతే అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీదే నన్న వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్మరించరాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవుపలికారు.
రెండ్రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్: మంత్రి ఉత్తమ్
జగిత్యాల: అన్ని మతాల సమ్మేళనమే కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో భాజపాను ఓడించాలంటే తమ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాశాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్ నాయకుల, కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి టికెట్లు దక్కని వారు అధైర్య పడొద్దని.. వారికి నామినేట్ పదవులు ఇస్తామన్నారు. సన్నబియ్యం కోసం ఏటా రూ.13,600 కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు.
రెండు రోజుల్లో మున్సిపల్ షెడ్యూల్ విడుదల అవుతుందని, ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. 90 శాతం మున్సిపల్‌లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలును భాజపా అడ్డుకుందని విమర్శించారు. మున్సిపల్‌లలో అధికార కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరవేస్తేనే అభివద్ధి జరుగుతుందన్నారు. మంత్రి అడ్లూరి లక్క్ష్మణ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య, నియోజకవర్గ ఇన్‌ఛార్జి జువ్వాడి నర్సింగరావు పాల్గొన్నారు.