నాంపల్లి అగ్ని ప్రమాదం..

బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
` ఘటనా స్థలం నుంచి ఐదు మతదేహాల వెలికితీత
హైదరాబాద్(జనంసాక్షి): నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో వైపు భవన యజమాని సతీశ్ బచాస్‌ను అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిన్న మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఐదుగురు మతి చెందిన విషయం తెలిసిందే.
అగ్ని ప్రమాద ఘటన అత్యంత దురదష్టకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఐదుగరు మరణించడం బాధాకరమన్నారు. ఫర్నిచర్ దుకాణం యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.అగ్ని ప్రమాదంపై హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జీహెచఎంసీ, పోలీస్, రెవెన్యూ, హైడ్రా అధికారులు సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలు ఉంటే ఫిర్యాదు చేయాలని కోరారు.
ఐదు మతదేహాల గుర్తింపు
నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. భవనం సెల్లార్‌లో ఐదు మతదేహాలను సిబ్బంది గుర్తించి బయటకు తీశారు. చిన్నారులు ప్రణీత్, అఖిల్‌తో పాటు బీబీ, ఇంతియాజ్, హబీబ్ మతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.నాంపల్లి స్టేషన్‌రోడ్డులోని హిందీ ప్రచార్‌సభ భవనం పక్కన సాయి విశ్వాస్ ఛాంబర్స్ ఐదంతస్తుల భవనంలో బచ్చాస్ ఫర్నిచర్ దుకాణం ఉంది. శుక్రవారం రాత్రి కంటైనర్‌లో చైనా నుంచి భారీగా ఫర్నిచర్ వచ్చింది. దాన్ని రెండు సెల్లార్లలో భద్రపరిచారు. దుకాణంలో సుమారు 22 మంది పనిచేస్తున్నారు. అక్కడ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న యాదయ్య, లక్క్ష్మి దంపతులు.. తమ ఇద్దరు పిల్లలు ప్రణీత్(11), అఖిల్(7)లతో కలసి సెల్లార్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం పిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. పిల్లల్ని సెల్లార్‌లోనే ఆడుకోవాలని చెప్పి తల్లిదండ్రులు పనివిÖద బయటకు వెళ్లారు.మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భవనంలోని రెండు సెల్లార్లలో అగ్నిప్రమాదం సంభవించింది. పొగలు రావడం గమనించి సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దుకాణంలో పనిచేస్తున్న సుభాన్‌పుర నివాసి మహ్మద్ ఇంతియాజ్(27), శాస్తిపురం ప్రాంతానికి చెందిన సయ్యద్ హబీబ్(40)లు.. సెల్లార్లో చిక్కుకున్న ప్రణీత్, అఖిల్, బీబీ(55) అనే వద్ధురాలిని బయటకు తీసుకువచ్చేందుకు లోపలికి వెళ్లి.. తిరిగి రాలేదు. దీంతో హైడ్రా, పోలీసు, ఫైర్ సహా 9 విభాగాల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పొగ దట్టంగా వ్యాపించడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకంగా మారింది. ఆదివారం ఉదయం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. ఫర్నిచర్ దుకాణం ఉన్న భవనం సెల్లార్‌కు జేసీబీతో రంధ్రం చేసి పనులు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌ను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు.