కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌లో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతిచెందారు. ఢాకాకు 248 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే ఘటనాస్థలానికి అధికార యంత్రాంగం చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ 30 మృతదేహాలను వెలికి తీశారు. కొండ చర్యలు కింద చిక్కుకున్న మరికొందరి కోసం సహయక చర్యలు కొనసాగుతున్నాయి.