కొండారెడ్డి పాలెంలో పారిశుద్ధ్య కార్యక్రమం

కందుకూరు, జూలై 18 : వివిపాలెం మండల పరిధిలోని కొండారెడ్డిపాలెం గ్రామంలో ఎంపిడివో మాలకొండయ్య ఆధ్వర్యంలో బుధవారం పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్బంగా ఎంపిడిఓ మండల వైద్యాధికారులు బ్రహ్మతేజ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు పారిశుద్ధ్యం, ఆరోగ్యం, వ్యాధుల నివారణ తదితర అంశాలపై ప్రజలతో ముఖాముఖి నిర్వహించి అవగాన కల్పించారు.