కొత్త కలెక్టర్‌కు స్వాగతం పలికిన అధికారులు

విజయవాడ, జూలై 31 : జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు మంగళవారం నగరానికి చేరుకున్న బుద్ధప్రకాశ్‌ ఎం.జ్యోతికి పలువురు అధికారులు స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుండి విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న బుద్ధప్రకాశ్‌ ఎం.జ్యోతికి రెవెన్యూ డివిజన్‌ అధికారి ఎన్‌.వెంకట్రావు స్వాగతం కలికి నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి తోడ్కొని వచ్చారు. అతిథి గృహం వద్ద డ్వామా పిడి హనుమానాయక్‌, మెప్మా పిడి శివశంకరరావు, యూత్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ వెలగా జోషి, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ కె.సుధాకర్‌, అర్బన్‌ తహశీల్దార్‌ ఆర్‌.శివరావు, అతిథి గృహ పర్యవేక్షకులు కె.పూర్ణచంద్రరావు స్వాగతం పలికారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయనను బదిలీ అయిన ప్రస్తుత కలెక్టర్‌ ఎన్‌ఎఎం రిజ్వీ ఆహ్వానించారు. అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టేందుకు బుద్ధప్రకాశ్‌ ఎం.జ్యోతి మచిలీపట్నం బయలుదేరి వెళ్లారు.