కోదండరామ్‌ పట్ల ఇంత అవమానమా: రేవంత్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): టీజేఎస్‌ చైర్మన్‌ కోదండరామ్‌పై పోలీసుల అనుచిత వైఖరిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసిన కోదండరాంను సర్కార్‌ ఇలా అవమాన పరుస్తుందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.