కోర్టుకు హాజరైన మంత్రి పార్థసారథి

హైదరాబాద్‌: నాంపెల్లిలోని ఆర్థికనేరాల న్యాయస్థానానికి మంత్రి పార్థసారధి నేడు హాజరయ్యారు. ఫెరా ఉల్లంఘనపై రూ.3 లక్షల జరిమానా చెల్లించలేదని మంత్రిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఈ కేసు విషయంలోనే ఆయన ఈ రోజు న్యాయస్థానం ముందు హాజరైనట్లు సమాచారం.