కోర్టు ట్రాన్స్‌కో ఆస్తుల జప్తుకు ఆదేశాలు

హుజురాబాద్‌: హజూరాబాద్‌కు చెందిన సాయికృష్ణ అనే యువకుడికి నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పును ఖాతరుచేయనందుకు గాను కోర్టు ట్రాన్స్‌కో ఆస్తుల జప్తుకు అదేశాలు జారీ చేసింది. 2003లో సాయికృష్ణ అనే ఆరేళ్ల బాలుడు ఇంటి డాబామీద ఆడుకుంటుండగా తీగలు కిందరకు ఉండటంతో కరెంటుషార్‌ కొట్టింది. దీంతో అ బాలుడికి చేయి మొత్తం పనికిరాకుండా పోయింది. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తమకు నష్టపరిహారం చెల్లించాలని బాలుడి తల్లిదండ్రులు కోర్టులో కేసు వేశారు. పలు వాయిదాలు విచారణ అనంతరం కోర్టు నాలుగు లక్షల ఇరవైవేలు నష్టపరిహారంగా ఇవ్వమని ట్రాన్స్‌కోను అదేశించింది. అయినా వారు స్పందించనందున ఆస్తుల జప్తునకు ఆదేశించారు. ఈరోజు ట్రాన్స్‌కో కార్యాలయానికి అధికారులు తాళం వేశారు.