కోర్టు బోనులో డెక్కన్‌ చార్జర్స్‌ భవితవ్యం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంచైజీ డెక్కన్‌ చార్జర్స్‌ (డీసీ) భవితవ్యం కోర్టు బోనులో ఉంది. ఐపీఎల్‌తో డీసీకి ఉన్న ఒప్పందాన్ని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు రద్దు చేసిన విషయం తెల్సిందే. ఈ రద్దు నిర్ణయాన్ని బీసీసీఐ సమర్థించుకుంది. ఈ నేపథ్యంలో డెక్కన్‌ చార్జర్స్‌ సంస్థ న్యాయపోరాటానికి దిగింది. డెక్కన్‌ చార్జర్స్‌ యజమాని డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ (డీసీహెచ్‌ఎల్‌) బీసీసీఐ నిర్ణయంపై స్టే విధించాలని కోరుతూ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తుది నిర్ణయం తీసుకోకుండా సోమవారానికి వాయిదా వేసింది. ఫలితంగా డెక్కన్‌ చార్జర్స్‌ భవిత కోర్టు చేతిలో ఉంది. వచ్చే ఐపీఎల్‌ సీజనుకు ఒక కొత్త జట్టుకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ఓ అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తోంది.