జమ్మికుంటలో విద్యాసంస్థల బంద్‌ సంపూర్ణం

జమ్మికుంట,జూన్‌20(జనంసాక్షి):ప్రైవేట్‌ పాఠశాలలో,కళాశాలలో ఫీజులను నియంత్రించాలని ప్రైవేట్‌ విద్యసంస్థలపై ప్రభుత్వ ఆజమాషి చెలాయించాలని ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సాంఘీక సంక్షేమ హాస్టల్‌లలో సరియైన సౌకర్యాలు కల్పించాలని అలాగే విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిఫ్‌లకు అందించాలని   కోరుతూ ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం రోజున జమ్మికుంటలో బంద్‌ సంపూర్ణంగా జరిగిందని ఎఐఎస్‌ఎఫ్‌ మండల అధ్యక్షులు దుకిరె శ్రీనివాస్‌ తెలిపారు. ఈకార్యక్రమంలో మాధవన్‌,బండి శ్రీనివాస్‌,విజ్జిగిరి శ్రీనివాస్‌,మహేందర్‌,మౌనిక,మణికంఠ తదితరులు పాల్గొన్నారు.