క్వార్డర్‌ల కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న హెచ్‌. ఎం. ఎన్‌

 

గోదావరి ఖని : సింగరేణి అర్‌ జీ 1 క్వార్టర్ల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకోంది. కార్మికులకు కేటాయించేందుకు నిర్వహించిన క్వార్టర్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలని హెచ్‌. ఎం. ఎస్‌ కార్మిక సంఘం అందోళనకు దిగింది. కౌన్సెలింగ్‌ విధానంలో మార్పులు చేసేవరకు వాయిదా వేయాలని డిమాండ్‌చేశారు.అయితే గుర్తింపు కార్మిక సంఘం టీజీబికెఎన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అధికారులతో హెచ్‌ఎంఎస్‌ టీజీబీకెఎన్‌ వాగ్వాదానికి దిగారు.కార్మికుల అభిప్రాయం మేరకే నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. గత రెండు నెలలుగా కౌన్సెలింగ్‌ నిర్వహించకపోవడంతో ఖాళీగా ఉన్న వాటిని కేటాయించలేకపోతున్నామని అధికారులు వారికి వివరించారు.అయినా హెచ్‌. ఎం. ఎన్‌ నేతలు పట్టువీడకపోవడంతో తాత్కాలికంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేశారు.