క‌రీంన‌గ‌ర్‌లో ఈసీఎల్ఏటీ హెల్త్‌కేర్ సెంట‌ర్: మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్‌: హెల్త్‌కేర్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న 3ఎం హెల్త్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్‌(హెచ్ఐఎస్), ఈసీఎల్ఏటీ హెల్త్ సొలూష‌న్స్ సంయుక్తంగా తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్‌లో కొత్త సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్నాయి. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగిన స‌మావేశంలో 3ఎం, ఈసీఎల్ఏటీ అధికారుల‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ సర్కార్‌తో ఆ సంస్థ‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. క‌రీంన‌గ‌ర్ కేంద్రంలో ఆ సెంట‌ర్‌ మెడిక‌ల్ కోడింగ్‌, క్లినిక‌ల్ డాక్యుమెంటేష‌న్ సేవ‌ల్ని అందించ‌నున్న‌ది. క‌రీంన‌గ‌ర్‌లో ఏర్పాటు చేయ‌నున్న ఈసీఎల్ఏటీ ఆపరేష‌న్స్ సెంట‌ర్‌లో వంద మందికి ఉద్యోగం క‌ల్పించ‌నున్నారు. ఆ త‌ర్వాత ఆ సెంట‌ర్‌లో ఉద్యోగుల సంఖ్య‌ను 200కు పెంచ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఈసీఎల్ఏటీ హెల్త్‌కేర్ సంస్థ‌తో కుదిరిన ఒప్పందం గురించి మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.