గజ వాహనంపై వూరేగిన శ్రీవారు

తిరుపతి: దేవ దేవుని బ్రహ్మూెత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు గజవాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగారు. గజవాహన సేవను వీక్షించేందుకు తరలి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడింది. స్వామివారి గజవాహనం ముందు భక్తుల కోలాట ప్రదర్శనలు, కళాకారుల నృత్యాలు, గోవిందనామ స్మరణతో తిరుమల కళకళలాడింది.