గడ్కరీ కంపెనలకు నకిలీ సంస్థల నిధులు
ముంబయి నవంబర్ 9,(జనంసాక్షి):
బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కంపెనీల అకార్యాల గురించి ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన విచారణలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి గడ్కరీకి పుర్టి పవన్ అండ్ ఘగర్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది ఈకంపెనీలోనికి వివిధ సంస్థలు నిధులు మరలించాయి,ఇలాటి సుమారు 18 కంపెనీలపై ఐటిముంబయిశాఖ దర్యాప్తు చేయగా అవి కాగితపు కంపెనీలేనని వెల్లడైంది ఇవి ఇచ్చిన చిరునామాలలో అసలు అవి ఉన్న జాడే లేదు ఇక ఆకంపెనీల డైరెక్టర్లు కూడా కాగితాలపై సృష్టించిన వారే వీటిని చాలాకాలం క్రితమే ఏర్పాటు చేశారు తర్వాత కొత్త ఇన్వెస్టర్లు వీలిని కొనుగోలు చేశారు వీరు నాగ్‌పూర్,కోల్‌కతాలకు చెందినవారు.ఇపుడు వారి గురించి ఆరాతీసేపనిలో ఐటి శాఖ నిమగ్నమై ఉంది వీరికి ఈ కంపెనీలు నిర్వహిస్తున్న లావాదేవీలతో సంబంధం లేనట్లుతెలుస్తోందని ఒక సీనియర్ అధికారి చెప్పారు ప్రారంభంలో వీటిని ఏర్పాటు చేసినపుడు ఎంత సోమ్ము వీటిలో పెట్టిందీ వివరాలు లేవు వీరిలో కొంతమంది డైరెక్టర్లుగా నమోదు చేశారు వారికి తాము డైరెక్టర్లమని తెలియదు.