గర్భిణీలకు మౌలిక సదుపాయాల కల్పన : కలెక్టర్‌

కర్నూలు, ఆగస్టు 1 : జననీ శిశు సంరక్ష కార్యక్రమం క్రింద వసతితో పాటు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఉచిత కాన్సులు, శస్త్రచికిత్సలు, మెడిసిన్స్‌, రానుపోను రవాణాఛార్జీలు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకోసం ప్రభుత్వం కూడా అవసరమైన నిధులను విడుదల చేసిందని కలెక్టర్‌ అన్నారు. గైనకాలజిస్ట్‌ జ్యోతిర్మయి మాట్లాడుతూ మామూలు కాన్పులకు రెండు రోజులు, సిజెరియన్‌ కాన్సులకు ఏడు రోజులపాటు వసతి కల్పిస్తామన్నారు. గర్భిణీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరిన్టెండెంట్‌ ఛాంబర్లో జననీ శిశు సంరక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ సందర్భంగా కలెక్టరు పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరిన్టెండెంట్‌ డా. ఉమామహేశ్వర్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాంప్రసాద్‌, అడిషనల్‌ డియంహెచ్‌ఓ డా. రాజసుబ్బారావు, గైనకాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ డా. జ్యోతిర్మయి, చీఫ్‌ రేడియాలజిస్ట్‌, డా. జ్యోజిరెడ్డి, ఆరోగ్యశ్రీ విభాగపు అధిపతి డా. శ్రీనివాసులు, డాక్టర్లు రాంగోపాల్‌, నరేంద్రుడు, రమాదేవి పాల్గొన్నారు.