గవర్నర్‌ను కలిసిన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వీసీగా తెలంగాణ ప్రాంత వ్యక్తినే నియమించాలని కోరుతూ తెరాస శాసనసభ్యులు గవర్నర్‌ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత వ్యక్తిని వీసీగా నియమించకపోవడం వల్ల ఈ ప్రాంతం నష్టపోయందన్నారు. ఈ అంశాన్ని  పరిశీలిస్తానని గవర్నర్‌ తమకు హామీ ఇచ్చినట్టు తెరాస నేత పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.