గాంధీ ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు
హైదరాబాద్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఈ ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన అక్బరుద్దీన్‌కు అత్యవసర విభాగంలో ఐదుగురు వైద్యుల ప్రత్యేక బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి భారీగా చేరుకున్న ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.