గిరిజన చట్టాలను అతిక్రమిస్తే ప్రతి అధికారి పై కేసులు వేస్తాం
ఎంపీపీ మంజు భార్గవి
ఆళ్లపల్లి ఆగష్టు05( జనం సాక్షి)
గిరిజన చట్టలను అతిక్రమిస్తే ప్రతి అధికారిపై కేసులు వేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల ఎంపీపీ మంజు భార్గవి అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పలు గ్రామాల రైతులతో భవిష్యత్ కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి క్లైమ్ నెంబర్ ఇచ్చాక కూడా పంటలను ధ్వంసం చేయడం చట్ట విరుద్ధమని 2006 అటవీ హక్కుల చట్టంలో అక్రమణ దారుడు దరఖాస్తు చేసుకునే ఉంటే ఆ రైతు భూమిని ఎవరు ఖాళీ చేయించడం వీలులేదని అన్నారు .చట్టాలను అతిక్రమించిన రేంజర్ పై అట్రాసిటి కేసు నమోదు చేయడంతో పాటు అతనిపై అధికారికంగా విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈనెల 9వ తేదీ వరకు కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయని పక్షంలో పోడు రైతు బాధితుల ఆధ్వర్యంలో రాయపాడు రైతులకు న్యాయం జరిగే వరకూ దశలవారిక ఉద్యమం చేపడతామని సమావేశంలో తీర్మానం చేశారు .గత నెల జులై 26న టేకులపల్లి లోని మొరళిపాడు బీట్ రాయపాడు గిరిజన రైతులు సాగు చేస్తున్న పోడు భూమిలో పంటలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ రేంజర్ పై డిఎస్పి కి ఫిర్యాదు చేసిన నేటి వరకు వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయపాడు సర్పంచ్ ఈశ్వరి, నిర్మల చంద్రకళ నాగేశ్వరరావు రామారావు ఎండీ ఖాయ్యం, ఎస్కే బాబా, నరెడ్ల ప్రవీణ్ ,కండే వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Attachments area