గీతారెడ్డికి బిఎస్ఏ జాతీయ అవార్డు

 

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
బహుజన సాహిత్య అకాడమీ అందించే “వుమెన్ లీడర్షిప్ నేషనల్ అవార్డు” కు కరీంనగర్ కి చెందిన సామాజిక సేవకురాలు వంగ గీతారెడ్డి ఎంపికయ్యారని అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
గత రెండు దశాబ్దాలుగా పలు సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థలలో కార్యకర్తగా పని చేస్తూ
పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులు గుర్తించి తనవంతుగా వందలాది మందికి సాయం చేసిన గీతారెడ్డి అభినందనీయురాలని అన్నారు. నవంబర్ 13న ఢిల్లీలో జరిగే బహుజన రచయితల, ఉద్యమకారుల 3వ జాతీయ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల గీతారెడ్డి తన ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణకు, రాష్ట్ర కమిటీ సభ్యులు ముక్కెర సంపత్ కుమార్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.