గుండారం కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక
జనంసాక్షి , కమాన్ పూర్ : మాజీ మంత్రి , మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భుంపెల్లి రాజయ్య అద్వర్యములో కమాన్ పూర్ మండలంలోని గుండారం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పిడుగు శంకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా జక్కుల శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శిగా గనవేన రవి, కోశాధికారిగా కందుల పోషాలు, కార్యదర్శిగా వడ్లకొండ శంకర్, ప్రచార కార్యదర్శిగా దామేర లింగయ్య, కార్యవర్గ సభ్యులు భూoపెల్లి కనకయ్య రాచకొండ ఓదేలు, పిడుగు సదయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకుల ఓదెలు ,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అఫ్సర్ , మాజీ సర్పంచ్ అడ్వాల చంద్రయ్య,మాజి కో ఆప్షన్ రఫిక్, మాజి డైరెక్టర్ జంగిలీ కనుకయ్యా, అర్ష ఎలయ్య, కుక్క రవి,రమేష్,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ ఇంఛార్జి పెండ్యాల రాజు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.