గుండెపోటుతో మృతి చెందిన సింగరేణి కార్మికుడు

గోదావరిఖని: సింగరేణి ఓసీటీ 3లోని వర్క్‌షాపులో పనిచేసే మధూసుదన్‌ రావు(45) గుండెపోటుతో మృతి చెందాడు. కార్మికుడు పని చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సింగరేణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.