గుండె పోటుతో కండక్టర్‌ మృతి

సుల్తానాబాద్‌,మే27(జనంసాక్షి)

మండలకేంద్రంలోని కుమ్మరివాడకు చెందిన నాంపల్లి నారాయణ(50) అనే వ్యక్తి ఆదివారం ఉదయం గుండెపోటుతో మృత చెందాడు. సుల్తానాబాద్‌కు చెందిన నారాయణ గోదావరిఖని డిపోలో కండక్టర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం ఉద్యోగరిత్య కాలకృత్యాలు తీసుకున్న వెంటనే టిఫిన్‌ బాక్స్‌ తీసుకొని బయల్దేరిన నారాయణ సుల్తానాబాద్‌ బస్సు ఎక్కి పెద్దపల్లికి వెళ్లే సరికి బస్సులోనే ఎలాంటి తీవ్రతకు నోచుకోకుండానే నిద్రలోనే మరణించడం జరిగింది.