గురజాడ 150వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

విజయనగరం: వ్వవహార భాషకు పట్టంకట్టిన మహాకవి గురజాడ అప్పారావు 150వ జయంతి ఉత్సవాలు బుధవారం విజయనగరంలోని ఆయన స్వగృహంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వట్టి వసంతకుమార్‌ గురజాడ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. నేతలు గురజాడ ఇంటిని పరిశీలించిన అనంతరం అక్కడినుంచి గురజాడ విరచిత దేశభక్తి గీతాలను అలపిస్తూ సత్యల్డాఇ్జ కూడలికి చేరుకున్నారు. అక్కడి నుంచి గురజాడ కళాభారతికి చేరుకుని కోటిరూపాయలతో చెపట్ట తలపెట్టిన ఆధునికీకరణ పనులకు శిలాఫలకం వేశారు. తర్వాత పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.