గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీని గెలిపించండి

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి):

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టియుసిని గెలిపించాలని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి బి.డాలయ్య కార్మికులను కోరారు. మంగళవారం ఆర్జీ-2 పరిధిలోని జిడికే-7ఎల్‌ఈపిలో ఏర్పాటు చేసిన గేట్‌మీ టింగ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టి యుసిని గెలిపిస్తే… కోల్పోయిన వారసత్వ ఉద్యోగాలను సాధిస్తామని, సకలజనుల సమ్మెలో కార్మికులకు ఇచ్చిన రూ.25వేల అడ్వాన్స్‌ను మాఫీ చేయిస్తామని, క్యాడర్‌ స్కీం, పెన్షన్‌, ప్రమోషన్‌ పాలసీలు, ఇతర హక్కుల సాధనకై కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ గేట్‌మీటింగ్‌లో నాయకులు కరుణాకర్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, అక్రమ్‌, ఆగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సరోత్తమ్‌రెడి&్డ, భూపతి, పెండ్లి రాములు, గట్టురాజు, మేకల ఐలయ్య, సంపత్‌, కనకయ్యతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.